అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం పై ప్రతిపక్ష నాయకడు భట్టి వ్యంగ్యంగా మాట్లాడటంపై సీఎం కేసీఆర్ కౌంటరిచ్చారు. గవర్నర్ ప్రసంగించిన బుక్ చాలా పెద్దగా ఉందని భట్టి విక్రమార్క వ్యంగ్యం చేశారు..భట్టిగారు తెలుసుకోవాల్సిందేమంటే మేం చాలా చేశాం కాబట్టే బుక్ చాలా పెద్దగా ఉందని భట్టికి కౌంటరిచ్చారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం చేసిందే గవర్నర్ ప్రసంగించారని అన్నారు. ప్రభుత్వం చేసిందేది భట్టి విక్రమార్క చెప్పడం లేదన్నారు సీఎం కేసీఆర్.
ఇక 2014 వేసవిలో 12.23 లక్షల ఎకరాల్లో పంట సాగయ్యిందన్న కేసీఆర్ ప్రస్తుతం వేసవిలో 58 లక్షల ఎకరాల్లో పంట సాగవుతోందని చెప్పారు. కాంగ్రెస్ కాలంలో నీరు పారకున్నా నీటి తీరువా వసూలు చేశారు. వైెస్ ఉచిత కరెంట్ ప్రకటించిన ఉత్త కరెంట్ గానే ఉండేదని ఎద్దేవా చేశారు. సూర్యపేటకు కాకతీయ కాలువ నీళ్లు వస్తాయని ఎవరైనా కలగన్నారా..? అని సీఎం కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. ఇక కరోనాపై కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నాయన్నారు సీఎం. రాష్ట్ర ప్రభుత్వం కరోనాపై అప్రమత్తంగా ఉంటోందన్నారు. రూ.25 వేల వరకు గత ఏడాది రైతు రుణమాఫీ చేశాం.. వంద శాతం రైతుల రుణాలు మాఫీ చేస్తాం.. వడ్డీ భారం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.