హైదరాబాద్ -. ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లపై ఉమ్మడి ఖమ్మం జిల్లాల నేతలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతి భవన్ లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, రవిచంద్ర, పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యేలు హరిప్రియ, సండ్ర, రాములు నాయక్, ఎమ్మెల్సీ మధు, జడ్పీ చైర్మన్ కమల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఖమ్మం పరిధిలో 5లక్షల మందితో సభకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పంజాబ్, ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులకు సభ కోసం ఆహ్వానాలను పంపినట్లు పేర్కొన్నారు. తొలి బీఆర్‌ఎస్ సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని నేతలకు కేసీఆర్ సూచించారు. జిల్లా నేతలందరూ వ్యక్తిగత విభేదాలు వీడి కలిసి పనిచేయాలని ప్రజాప్రతినిధులకు కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement