Saturday, November 23, 2024

TS | కవిత అరెస్ట్‌పై తొలిసారి స్పంధించిన కేసీఆర్..

ఢిల్లీ లిక్కర్ కేసుపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారి స్పందించారు. మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన తర్వాత.. కేసీఆర్ మొదటిసారిగా మీడియా ముందు కవిత అరెస్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ కేసు అంతా బూటకమని కేసీఆర్ ఆరోపించారు. తన కూతురు కవితను ఈడీ అరెస్ట్ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. బీజేపీ కుట్రపూరితంగానే కవితను ఈ కేసులో ఇరికించింని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదంతా బీజేపీ ఆడుతున్న నాటక‌మని అని విమర్శించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ ను అరెస్ట్ చేసేందుకు బీఆర్ఎస్ పోలీసులను పంపిందని కేసీఆర్ గుర్తు చేశారు. ఈ ఘటన జరిగిన నుంచి బీఆర్ఎస్ పై ప్రధాని మోదీ కక్ష కట్టారని కేసీఆర్ అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కవితను బీజేపీ అక్రమంగా మద్యం కేసులో ఇరికించి జైలుకు పంపిందని అన్నారు. అరెస్టయి ఇన్ని రోజులు గడుస్తున్నా ఈ కేసులో కవితకు వ్యతిరేకంగా ఈడీకి ఒక్క ఆధారం కూడా కనిపించలేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement