హైదరాబాద్, ఆంధ్రప్రభ : వారం రోజుల్లో కేసీఆర్ న్యూట్రీషన్ కిట్‌ను రాష్ట్రమంతటా ప్రారంభించేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. మాతా శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లను అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ కిట్‌లో న్యూట్రిషన్ మిక్స్ పౌడర్, కేజీ ఖర్జూర, 3 బాటిళ్ల ఐరన్ సిరప్, అరకిలో నెయ్యి, అల్బెంజడోల్ మాత్రలను అందించనున్నారు.
గర్భం దాల్చిన 3, 6 నెలలకు రెండుసార్లు వీటిని అందిస్తారు. ఇప్పటికే ఈ పథకం కొన్ని జిల్లాల్లో పైలట్‌గా అమలు చేస్తున్నారు. 10 రోజుల్లో ఈ పథకాన్ని రాష్ట్రమంతటికీ విస్తరించాలని ప్రభుత్వం అక్ష్యంగా పెట్టకొన్నది. ఈ నేపథ్యంలో ఈ పథకం అమలుపై మంత్రి హరీష్‌రావు అహర్నిషలు శ్రమిస్తున్నారు.