గర్భిణిలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనిస్తారని, తద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మించుకోవచ్చు మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు గ్రామంలో హంస హోమియోపతి మెడికల్ కళాశాల 75 పడకల సంయుక్త బోధన దవాఖానను ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. గర్భిణిల ఆరోగ్యాన్ని దృష్టిలోపెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలో గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందించనున్నట్లు తెలిపారు. ఆయుష్‌కు మంచి భవిష్యత్ ఉన్నదని, మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో సాంప్రదాయ వైద్యానికి రోజు రోజుకు ప్రాధాన్యం పెరుగుతున్నదన్నారు. ఆయుర్వేదం, యోగ, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి.. దేనికవే ప్రత్యేకత కలిగి ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో అందరికీ వైద్యం అందించే క్రమంలో కేసీఆర్ ఆలోచనల మేరకు బస్తీ పల్లె దవాఖానాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పల్లె దవాఖానల్లో ఆయుష్ డాక్టర్లను కూడా రిక్రూట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాలని కేంద్ర ఆయుష్ సెక్రెటరీ రాజేష్‌కు కొటేషన్ కూడా పంపినామని చెప్పారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement