Friday, November 22, 2024

బిడ్డ పుట్టాక కేసీఆర్ కిట్, పుట్టక ముందు తల్లికి న్యూట్రిషన్ కిట్ : మంత్రి హ‌రీశ్ రావు

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ లో 30 పడకల ఆసుపత్రిని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.
మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… 5 కోట్లతో 30 పడకల ఆసుపత్రి ప్రారంభించు కోవడం సంతోషంగా ఉంద‌న్నారు. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామ‌న్నారు. ఎమ్మెల్యే కోనేరు కొనప్ప ప్రజల కోసం అందిస్తున్న ఉచిత భోజన సదుపాయాలు చూసి, వారి వనపర్తిలో అమలు చేసేందుకు వచ్చారు. సీఎం కేసీఆర్ మొన్ననే న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభించార‌ని, గర్భిణులకు ఇది వరంగా మార‌నుంద‌న్నారు. బిడ్డ పుట్టాక కేసీఆర్ కిట్, పుట్టక ముందు తల్లికి న్యూట్రిషన్ కిట్ అన్నారు. పుట్టుక నుండి చావు దాకా ప్రతి అంశంపై ఆలోచించే నాయకుడే సీఎం కేసీఆర్ అన్నారు. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆలోచన మేరకు కిట్ లో పల్లి పెట్టీ పెట్టాలనీ చెప్పామ‌న్నారు. మొన్న మంచిర్యాలలో మెడికల్ కాలేజీ ప్రారంభించాం,ఆసిఫాబాద్, నిర్మల్ లో కొత్తగా మెడికల్ కాలేజీలు వచ్చాయ‌న్నారు. నాడు వైద్యం కోసం ఇక్కడి ప్రజలు మహారాష్ట్ర కు వెళ్ళేవారు.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడకు వస్తున్నారు అన్నారు. రాష్ట్రంలో నాడు మూడు డయాలసిస్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 102 పెంచాము, మంచిర్యాల, అదిలాబాద్, నిర్మల్ లో ప్రారంభం చేశాం.. ఇప్పటికే మంజూరు చేశాం వారం రోజుల్లో కాగజ్ నగర్ లో చేస్తాన్నారు. ఏడాదికి వంద కోట్లు ఖర్చు పెట్టి డయాలసిస్ ఉచిత సేవలు అందిస్తున్నామ‌న్నారు. రోగం రాకుండా ఉండేలా ప్రయత్నం చేస్తున్నాం.. మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి తాగు నీరు ఇచ్చాం.. నాడు గూడెం, తండాలు మంచాన పడ్డాయి అంటే బాధ అనిపించేద‌ని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు అన్నారు. 2014 కు ఇప్పుడు చూస్తే, డయేరియా 8071 కేసులు ఉంటే ఈ ఏడాది 1100, మలేరియా కేసులు 6196 నమోదు అయితే 77 కు తగ్గాయి. బీపీ షుగర్ ముందే తగ్గించేలా స్క్రీనింగ్ చేస్తున్నాం. మొన్ననే 950 డాక్టర్ల నియామకం పూర్తి చేశాం… ఎల్లుండి 31 తారీకున అందరికీ ఆర్డర్స్ ఇస్తాము. ఇందులో ఆసిఫాబాద్ జిల్లాకు ప్రాధాన్యం ఇస్తాం అన్నారు. అన్ని పి హెచ్ సి ల్లో ఖాళీలు నింపుతామ‌ని, పల్లె దవాఖానలు వస్తున్నాయి. 90 ఏఎన్ఎం సెంటర్లను పల్లె దవాఖానలుగా మార్చి డాక్టర్ భర్తీ చేస్తాం అన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ అగ్రగామిగా ఉంది, మన పథకాలు కాపీ కొట్టి దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు పథకాలు కాపీ కొట్టి అమలు చేస్తున్నారు. ఢిల్లీలో కాపీ కొడతారు, గల్లీకి వచ్చి తిడతారు. ప్రధాన మంత్రి వచ్చి రామగుండంలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట.. గుజరాత్ లో లిగ్నైట్ గనులను గుజరాత్ గనుల సంస్థకు ఇచ్చారు. ఇక్కడ వేలం వేస్తున్నారు. గుజరాత్ కి ఒక నీతి, తెలంగాణకు ఒక నీతి అని ప్ర‌శ్నించారు. సింగరేణి ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నార‌ని, నాలుగు గనులు ఎలా ప్రైవేటు పరం చేస్తున్నారు అన్నారు. బిజెపి హటావో సింగరేణి బచావో అని మనం పోరాటం చేయాల‌న్నారు. పనులు చేసేది ఎవరు.. పన్నులు వేసేది ఎవరో ప్రజలు ఆలోచించాలి అన్నారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జెడ్ పి ఛైర్మెన్ కోవా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement