రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ అసెంబ్లీలో ప్రకటించారు. ఈరోజు నుంచే నోటిఫికేషన్ సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ప్రకటనపై తెలంగాణ జన సమితి నేత కోదండరామ్ స్పందించారు. కేసీఆర్ ప్రకటన సంతృప్తికరంగా లేదన్నారు. 1.92లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటే, కేవలం 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. అలాగే ఇప్పటి వరకూ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని కేసీఆర్ ప్రకటించారని, అది అవాస్తవమని కోదండరామ్ తెలిపారు. అలాగే 95శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అదే సమయంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా దీనిని అమలు చేయాలని కోదండరామ్ కోరారు. సమగ్రమైన ప్రకటన చేయాలని కోదండరామ్ కోరారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital