నేడు మహారాష్ట్ర నాందేడ్‌లో బీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించనుంది. కేబినెట్ భేటీ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాందేడ్ వెళ్లనున్నారు. మధ్యామ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నాందేడ్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12.30కి నాందేడ్ ఎయిర్‌పోర్టుకు సీఎం కేసీఆర్ చేరుకుంటారు. సభా వేదిక దగ్గర శివాజీ విగ్రహానికి నివాళులు కేసీఆర్ నివాళులర్పించి, అనంతరం గురుద్వార్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. సభా వేదికపై కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో మహారాష్ట్ర ముఖ్యనేతలు 60 మంది చేరనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరు అవుతారని నాయకులు అంచానా వేస్తున్నారు. నాందేడ్ జిల్లాలోని నాందేడ్ సౌత్, నార్త్, బోకర్, నాయిగాం, ముఖేడ్, డెగ్లూర్, లోహ నియోజకవర్గాలు, కిన్వట్, ధర్మాబాద్ పట్టణాలు, ముద్కేడ్, నాయిగాం, బిలోలి, ఉమ్రి, హిమాయత్ నగర్, తదితర మండలాల్లోని అన్ని గ్రామాల నుండి పెద్దఎత్తున ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా నాందేడ్ జిల్లా సరిహద్దు తెలంగాణ నియోజకవర్గాలైన ఆదిలాబాద్, బోథ్, ముధోల్, బోధన్, జుక్కల్‌తో పాటు నిర్మల్, నిజామాబాద్ నియోజకవర్గాల నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు సభకు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement