Saturday, November 23, 2024

విద్వేష కుట్ర‌లు! – కేంద్రం ద‌ద్ద‌మ్మ పాల‌న‌తో విధ్వంసం..

దేశంలో మతపిచ్చితో విద్వేష రాజకీయాలు సాగిస్తూ కుట్రలు చేస్తున్నారు… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… ఇటువంటి కుట్రలను కొనసాగిస్తే దేశం అధోగతే… ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యంలా మారుతుంది… జాతి జీవనాడే దహించుకుపోతుంది… ఇదిలా కొనసాగితే పెట్టుబడులు వస్తాయా? అభివృద్ధి జరుతుందా? యువత నిర్వీర్యం కాదా? సమాజంలో అశాంతి రేగితే వచ్చేవి కర్ఫ్యూలే… అద్భుత చైతన్య, విజ్ఞాన వీచికలు తెలంగాణ నుంచే వీచాలి… దేశ రాజకీయాలకు తెలంగాణ వెలుగు మార్గం చూపాలి… కేంద్ర పక్షపాత ధోరణి వల్ల తెలంగాణ మూడు లక్షల కోట్లను నష్టపోయింది… దేశంలో 24 గంటల విద్యుత్‌ ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రమే… దేశంలో అవసరానికి మించి విద్యుత్‌, నదుల్లో నీరున్నా జనానికి అందవు… ఇదేం దౌర్భాగ్యం? దీనికి కారణం చేతకాని దద్దమ్మ కేంద్రం అనుసరిస్తున్న అసమర్ధ విధానాలే… డబ్బాలో గులకరాళ్లేసినట్టు లొడలొడ ఉపన్యాసాలు దంచడం కాదు… సమాజం పురోగమించాలంటే సర్వజన సంక్షేమం కాంక్షించాలి… నేనొక్కటే ప్రార్ధిస్తున్నా… నేను చెప్పే విషయాలను చర్చకు పెట్టండి… వాస్తవాలు గ్రహించండి…

ఆంధ్రప్రభ, మహబూబాబాద్‌/కొత్తగూడెం/హైదరాబాద్‌ బ్యూరో : దేశంలో మత, కుల పిచ్చిని పెంచి, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేందుకు కొంతమంది ప్రయ త్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ, జాతి సమైఖ్యత ను విద్వంసం చేసే రాజకీయ పార్టీలను ప్రజలు నమ్మ వద్దంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో యువత ముందుండి పోరాడాల్సిన అవసరం ఉంద ని గుర్తుచేశారు. మనం కూడా తాలిబన్లలా మారితే పెట్టు-బడులు వస్తాయా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. సమాజంలో అశాంతి రేగితే కర్ఫ్యూలు వస్తాయి, కానీ అభివృద్ధి ముందుకు సాగదన్నారు. విద్వేష రాజకీయాల గురించి దేశ ప్రజలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ విషయాన్ని గుర్తించా లని విజ్ఞప్తి చేశారు. దేశాన్ని వక్రమార్గంలో పెట్టే దుష్ట పన్నాగాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అసమర్థ విధానాలు అవలం బిస్తోందనీ, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 3 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను విడదీసే కొన్ని రాజకీయ పార్టీల కుట్రలను భగ్నం చేయాలని, కుతంత్రాలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

మహబూబాబాద్‌, కొత్త గూడెం భద్రాద్రి జిల్లాల్లో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సము దాయాలను గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ఆయన మాట్లా డుతూ, వ్యవసాయ అనుకూల భూ భాగం ఉన్న అతి పెద్దదేశం మనదే అయినప్పటికీ, దారిద్య్రం వెంటాడ డానికి ప్రధాన కారణం ఈ పార్టీలు, ప్రభుత్వాల విధా నాలేనని సీఎం దుయ్యబట్టారు. దేశంలో 83 కోట్ల ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉందనీ, జల వనరులు, మానవ వనరులు పుష్కలంగా ఉన్న దేశం మనదని గుర్తుచేశారు. దేశంలో లక్షా 40 వేల టీ-ఎంసీల నీరు అందుబాటులో ఉన్నప్పటికీ అందులో 10శాతం కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయకపోవడం అసమర్ధత కాదా..? అని ప్రశ్నించారు. దేశంలోని యువత అత్యంత జాగరకతతో వ్యవహరించాలని, ఈ ఉన్మాద చర్యలపై ఆలోచిం చాలని రాజకీయాలవైపు దృష్టి పెట్టా ల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని సూచించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతోనే అనేక రాష్ట్రాల్ల్రో కనీస అభివృద్ధి కూడా జరగడం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లోనూ ఊహించని విధంగా తగ్గుదల కనిపిస్తోందన్నారు. ఇకపై యావత్తు దేశం అభివృద్ధిలో తెలంగాణ ప్రజల పాత్ర మరింతగా పెరగాలని ఆకాం క్షించారు. తెలంగాణ ప్రజలు పోరాటం, ప్రశ్నించే తత్వం కలిగిన వారని, రాజకీయ కుట్ర లను తిప్పికొడతారని ధీమాగా పేర్కొన్నారు.

ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి జరగాలన్న ఆకాంక్షతోనే ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ ప్రాంతాలను జిల్లా లుగా చేయాలని పట్టు-బట్టి చేశానని తెలిపారు. దాని ఫలితం కళ్ల ముందు నేడు కనిపిస్తోందని అన్నారు. రాష్ట్రం ఎంతో అభివృద్ధి దశలో ఉందని, అందుకు మెడికల్‌ కళాశాలల ఏర్పాటే నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు మున్ముందు జరగా ల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. త్వరలోనే ఇక్కడ ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాల కూడా ప్రారంభిస్తామని ప్రకటించారు. భద్రాద్రి జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటు-న్నట్లు- తెలిపారు. కొత్తగూడేనికి కొత్త జిల్లాతో పాటు కొత్త వైద్య కళాశాల కూడా వచ్చిందన్నారు. కొత్తగూడేనికి కొత్త థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం వచ్చిందని చెప్పారు. కొత్తగూడెం ఎక్కువ చైతన్యం ఉన్న ప్రాంతమని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో తనను అరెస్టు చేసి ఖమ్మం తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. తనను అరెస్టు చేసి ఖమ్మం తీసుకొచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు కడుపులో పె ట్టి చూసుకున్నారని చెప్పారు.
ఎప్టికప్పుడు ఆ సందర్భాలను గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రజలందరినీ కడుపులో పెట్టు-కుని ముందుకు సాగుతున్నామన్నారు.
అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలతో తెలం గాణ అభివృద్ధివైపు దూ సుకుపోతోందని, అడగ కుండానే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మని తెలిపారు. ఆర్థిక అసమా నతలను తరిమికొట్టేందుకు ప్ర భుత్వం మానవీయ కోణంతో ‘కేసీఆర్‌ కిట్‌’ ను అందిస్తోందన్నారు. మానుకోట రాళ్ల బలంతో పాటు- అన్ని కలగలిపి తెలం గాణ రాష్ట్రం కల సాకరమైం దని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ వచ్చింది కాబట్టే అనేక పనులు చేసుకోగలుగుతు న్నామని అన్నారు. కొత్తగా ప్రారంభిం చుకుంటున్న జిల్లా కలెక్టరేట్లు ప్రజా కార్యాల యాలుగా వర్ధిల్లాలని సీఎం ఆకాంక్షించారు. ప్రతి జిల్లాలో దాదాపుగా జిల్లా లోనూ కొత్త కలెక్టరేట్‌ భవ నం నిర్మాణం- పూర్తవు తోందని చెప్పారు.
ఇటీ-వల పంజాబ్‌ నుంచి వచ్చిన అధికారులు, ప్రజా ప్రతినిధుల బృందం మన కలెక్టరేట్ల డిజైన్‌ను చూసి మా మినిస్టర్‌ చాంబర్‌ కంటే మీ కలెక్టర్‌ చాంబర్‌ బాగుందని కొని యాడిన విష యాన్ని ఈ సంద ర్భంగా గుర్తుచేశారు. ఖమ్మం జిల్లాలో ప్రతి అంగుళానికి నీరు తెచ్చేలా కృషి చేస్తా మనీ, సీతారామా ప్రాజెక్టు వేగంగా పూర్తవుతో ందని గుర్తుచేశారు. సీతారామా ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లా పూర్తిగా సస్య శ్యామలం అవుతుందన్నారు. 37 టీ-ఎంసీల నీటి నిల్వతో సీతారామా ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని కేసీఆర్‌ వెల్లడిం చారు. సీఎంఆర్‌ఎఫ్‌ కింద దేశంలోనే ఎక్కువ మందికి సాయం చేస్తున్న ఘనత తులంగాణ ప్రభుత్వానికి దక్కు తుందన్నారు. ముర్రేడు వాగు వరద నివారణ కార్యక్రమం వెంటనే చేపడతామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.

- Advertisement -

నాడు బాధతో గోదావరి తల్లికి దండం పెట్టా..
మహబూబాబాద్‌ జిల్లా అభివృద్ధి విషయంలో నాటికి నేటికి ఎంతో తేడా ఉందని సీఎం అన్నారు. ఎనిమిదేళ్ల క్రితం నాటి మానుకోట ప్రాంతం ఎంతో వెనుకబడి ఉందని, కరువు కాట కాలతో అల్లాడుతుండటాన్ని తాను ఉద్యమం సమయంలో స్వ యంగా చూశానని అన్నారు. మహబూబూబాద్‌ జిల్లా పాల కుర్తి, వరం గల్‌లోని వర్ధన్నపేట నియోజకవర్గాలను పరిశీలిం చినప్పుడు చాలా బాధ అనిపించిందని అన్నారు. ములుగు, ఏటూరునాగారం మీదుగా ప్రయాణం చేసినప్పుడల్లా గోదావరి నదికి తల్లికి దండం పెట్టి మా దాహార్తిని, మా భూములను ఎప్పుడు నీ నీటితో తడుపుతావని తల్లి గోదావరిని కోరుతూ నమస్కరించి రాగి నాణలు వేసేవాడినని పాత జ్ఞాపకాలను ఈ సందర్భంగా కేసీఆర్‌ నెమరువేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement