Friday, November 22, 2024

అడ్వ‌కేట్ దంప‌తుల హ‌త్య కేసుకు మాకు సంబంధం లేదు- సీఎం కేసీఆర్

అడ్వ‌కేట్ దంప‌తుల హ‌త్య కేసుతో టీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేద‌ని ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు స్ప‌ష్టం చేశారు. ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గవ‌ర్నర్ చేసిన‌‌ ప్రసం‌గా‌నికి ధన్య‌వా‌దాలు తెలిపే తీర్మా‌నంపై చ‌ర్చ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ర్టంలో పోలీసు శాఖ నిస్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల సంద‌ర్భంలో కూడా పోలీసు వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేయ‌లేదు. గ‌త శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌రిగిన‌ప్పుడు డీజీపీకి కూడా ఫోన్ చేయ‌లేదు. ప్ర‌జాక్షేత్రంలో నిబ‌ద్ద‌త‌గా ఉంటున్నాం. అడ్వ‌కేట్ దంప‌తుల హ‌త్య దుర‌దృష్ట‌క‌రం.ఖండిస్తున్నాం. ఈ హ‌త్య కేసులో ఎవ‌రున్నా స‌రే వ‌దిలిపెట్టం.

ఇప్ప‌టికే ఆరుగురిని అరెస్టు చేశాం. కుంట శ్రీనివాస్‌, చిరంజీవి, అక్క‌ప్ప కుమార్‌, శ్రీనివాస్‌, బ‌డారి ల‌చ్చ‌య్య‌, వెల్ది వసంత‌రావును పోలీసులు అరెస్టు చేశారు.న్యాయ‌వాది దంప‌తుల హ‌త్య కేసులో మాకు, మా పార్టీకి అస‌లు ప్ర‌మేయం లేదు. హ‌త్య కేసులో టీఆర్ఎస్ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు ఉన్నాడు. ఆ విష‌యం తెలిసిన మ‌రుక్ష‌ణ‌మే పార్టీ నుంచి తొల‌గించాం. అత‌న్ని అరెస్టు కూడా చేశారు. వారు కూడా జైల్లో ఉన్నారు. ఈ కేసు విష‌యంలో కాంప్ర‌మైజ్ అయ్యే స‌మ‌స్య లేద‌న్నారు. ఈ కేసు విష‌యంలో ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేదు.. పోలీసులు నిస్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement