Tuesday, December 24, 2024

TG | క్వాష్‌ పిటిషన్ దాఖలు చేసిన కేసీఆర్‌, హరీష్‌రావు

హైదరాబాద్‌,ఆంధ్రప్రభ : భూపాలపల్లి కోర్టు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులు సోమవారం హైకోర్టులో క్వాష్‌ పిటిషన్లు దాఖలు చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ గతంలో భూపాలపల్లి కోర్టులో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి పిటిషన్‌ వేసారు.

మేడిగడ్డ బ్యారేజీని నిర్మించే క్రమంలో ప్రజాధనం వృథా అయిందని, నిర్మాణంలో ప్రమాణాలు పాటించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై 2024 సెప్టెంబర్‌ 5, అక్టోబర్‌ 17వ తేదీల్లో భూపాలపల్లి జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. తరువాత తదుపరి విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.

రాజలింగమూర్తి పిటిషన్‌ ఆధారం చేసుకుని భూపాలపల్లి కోర్టు కేసీఆర్‌, హరీశ్‌రావులతో సహా మరో ఆరుగురికి నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ తాజాగా హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌రావులు ఈ నోటీసులను కొట్టివేయాలని పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement