హైదరాబాద్ – నీరు – నిప్పులా ఒకరిపై సందు దొరికితే విమర్శనాస్త్రాలు సందించుకునే ముఖ్యమంత్రి కెసిఆర్, బిఆర్ ఎస్ మాజీ నేత, బిజెపి శాసనసభ్యుడు ఈటల రాజేందర్ ల మధ్య అసెంబ్లీలో ఆసక్తికరమైన చర్చ జరిగింది.. చివరి రోజైన అసెంబ్లీ సమావేశాలలో లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. కనీసం 10 సార్లు పైగా ఈటల పేరును ప్రస్తావించారు.. ముందుగా ఈటల మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలలో డైట్ చార్జీల కోటా పెంచాలని ప్రభుత్వాన్ని. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్.. ఈటెల రాజేందర్ సూచనలను ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఈటెలది న్యాయమైన కోరిక గనుక జీవోను జారీ చేయాలని సూచించారు. ఈటల రాజేందర్ అడిగారని చేయకుండా ఉండొద్దన్నారు. కావాలంటే ఈటెలను కూడా పిలిచి సలహా తీసుకోవాలని సూచించారు. తమకు ఎలాంటి భేషజాలు లేవని, మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తామని అన్నారు. మా రాజేందర్ అన్న సందు దొరికితే బద్నాం చేయాలనే ఆలోచనలో ఉన్నారని అన్నారు. ఎస్సారెస్పీ నుంచి మహారాష్ట్రకు నీళ్లు ఇస్తానన్నావు అని అడుగుతున్నాడు.. దేశంలో నీటి యుద్ధాలు ఎందుకు? అని ప్రశ్నించారు. కిసాన్ సర్కార్ వస్తే తప్ప ఈ దేశం బాగుపడదన్నారు. అందుకే ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని పెట్టామన్నారు.
అయితే కెసిఆర్ తన పేరును పదేపదే ప్రస్తావించడం పై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ స్పందించారు. సీఎం కేసీఆర్ తనని డ్యామేజ్ చేయాలనుకున్నారని, చేసేసారని అన్నారు. ఒక అబద్ధాన్ని అటు చెప్పగల, ఇటు చెప్పగల నాయకుడు కేసీఆర్ అని.. కెసిఆర్ చేసిన డ్యామేజ్ కడుక్కోవాలంటే ఎన్ని నెలలు పడుతుందోనని వ్యాఖ్యానించారు.