హైదరాబాద్, ఆంధ్రప్రభ : కాజీపేట వాగన్ రిపేర్ వర్క్‌షాప్ రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మారనుంది. ఈ ప్రాజెక్టును సాకారం చేయడంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. తొలుత కాజీపేట వాగన్ రిపేర్ వర్క్‌షాప్ ప్రతీ నెలా 200 వాగన్ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ చేపట్టడం కోసం ప్రతిపాదించారు. రైల్వేల సరుకు రవాణా కోసం మరిన్ని వాగన్లు అవసరం కావడం, ఈ ప్రాంతపు ఉపాధి అవసరాలు, ఆర్థికాభివృద్ధి దృష్ట్యా పివోహెచ్ నుంచి ఆర్ఎంయునకు మార్పు చేయవలసిన అవసరాన్ని క్రమం తప్పకుండా రాజకీయ నేతల మద్దతుకు ప్రతిపాదనలు ద.మ.రైల్వే అధికారులు పంపించారు.
కాగా, కాజీపేట వాగన్ రిపేర్ వర్క్‌షాప్ రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా మారనుండటంతో అదనంగా గ్యాంగ్ డ్రిల్లింగ్ యంత్రం, షీరింగ్ యంత్రం, బెంచ్ ప్రెస్, యూనివర్సల్ అండర్ ఫ్రేమ్ వెల్డింగ్ మ్యానిపులాటర్స్, హుక్ బోల్టింగ్ యంత్రం ఆదనంగా అవసరం అవుతాయని, అలాగే, అదనంగా జిగ్స్, ఫిక్చర్స్ స్థాపించాల్సి ఉంటుందని ప్రతిపాదించారు. అలాగే, మొదటి సంవత్సరం 1200 వ్యాగన్లు, రెండో సంవత్సరం 2400 వ్యాగన్లు కాకుండా ఈ సామర్ధ్యాన్ని మరిన్ని అధిక సైడ్ వాల్స్, ఎండ్ వాల్స్ తయారీ వీల్ షాప, పెయింట్ షాప్ సామరధ్యంపై ఆధారపడి పెంచుకోవచ్చని ద.మ.రైల్వే అధికారులు ప్రతిపాదించారు.