Tuesday, November 26, 2024

మార్చిలో కజకిస్థాన్‌ వేదికగా ఆసియా హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌..

మార్చిలో ఆసియా మహిళల యూత్‌ హ్యాండ్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. ఈ సందర్భంగా ఛాంపియన్‌షిప్‌లో పోటీపడే భారత జట్టుకు సన్నాహక శిబిరం ఏర్పాటు చేశామని జాతీయ హ్యాండ్‌ ఫెడరేషన్‌ (హెచ్‌ఎఫ్‌ఐ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు తెలిపారు. ఈ నెల 12, 13వ తేదీల్లో ట్రయల్స్‌ నిర్వహించి 27మంది క్రీడాకారిణులను ఎంపిక చేశామని ఆయన వెల్లడించారు. ఈ మెగా టోర్నీ మార్చి 18నుంచి 27వరకూ కజకిస్థాన్‌లో జరగనుందని.. జాతీయ శిక్షణ శిబిరానికి రాష్ట్రం నుంచి కరీనా ఎంపికైందని తెలిపారు.

ఇతర రాష్ట్రాల నుంచి చేతన, పూజా గుర్జర్‌, ననిత, నిక్కీ చౌహాన్‌, దీక్ష, రీతు, రేణు, తనీషా, ఆరాధన, హర్షిత, సౌమ్య మిశ్రా తదితరులు శిబిరానికి ఎంపికయ్యారని వివరించారు. శిక్షణ శిబిరానికి హెడ్‌ కోచ్‌గా మోహిందర్‌లాల్‌ (సాయ్‌), కోచ్‌గా ఎం.రవికుమార్‌ (శాట్స్‌) నియమితులయ్యారు. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) అనుమతితో క్యాంప్‌ నిర్వహించనున్నామన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement