కవాసకి తన మొదటి ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ నింజా E-1 & Z e-1, రెండు 125cc బైక్‌లను విడుదల చేయనుంది. ఈ బైక్‌లు యూకేలో తొలిసారిగా అమ్మకానికి రానున్నాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్ మోడల్‌లు సూపర్ ప్రీమియం లుక్‌తో పాటు సూపర్ స్పోర్టీ లుక్‌ను కలిగి ఉన్నాయి. మరి త్వరలో విడుదల కానున్న ఈ ఎలక్ట్రిక్ బైక్ మోడళ్ల ఫీచర్లను చూద్దాం..
కవాసకి నింజా E–1 & Z e-1
నింజా E-1 ఎలక్ట్రిక్ బైక్‌లో క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్‌లతో కూడిన స్ప్లిట్ LED హెడ్‌లైట్, స్ప్లిట్ సీట్& సూపర్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ లాగా కనిపించే పూర్తి ఫెయిరింగ్ ఉన్నాయి.
Z e-1 ఎలక్ట్రిక్ బైక్ లో కూడా LED హెడ్‌లైట్, స్ప్లిట్ సీట్& నెక్‌టో స్టైల్ మోటార్‌సైకిల్‌గా కనిపిస్తుంది.
కవాసకి ఎలక్ట్రిక్ బైక్‌లు రెండూ ఈజీ రిమూవబుల్ బ్యాటరీలతో వస్తాయి. 5kW ఎలక్ట్రిక్ బ్యాటరీతో వస్తున్న కవాసకి E-1 & Z E-1 గరిష్ట వేగం 99 kmphని కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇందులో రోడ్ & ఎకో అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయని వెల్లడించింది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో పాటు, పూర్తిగా డిజిటల్ TFT వంటి ఇతర ఫీచర్లను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక, ఈ బైక్‌లు వచ్చే నెలలో UKలో విక్రయానికి కానుండగా.. అదే సమయంలో, కంపెనీ ధర వివరాలను వెల్లడిస్తుంది.