వెూడీ సర్కారు ఇక ఇంటికే
ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
ప్రజల్లో వ్యతిరేకత బాగా పెరిగింది
చెన్నైలో చర్చా వేదికలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఆంధ్రప్రభ: 2024లో బీజేపీ గెలిచే అవకాశాలు ఏ మాత్రం లేవని ఎమ్మెల్సీ కల్వకుంట్ల తెలిపారు. ”2024 ఎన్నికలు- ఎవరు విజయం సాధిస్తారు” అనే అంశంపై చెన్నైలో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. పారదర్శకత, నిబద్దతతో పాలన అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆ హామీలేవీ నిలుపుకోలేదన్నారు. మోడీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపి కొత్త వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత పదేళ్లలో ప్రధానిగా మోడీ ఏం చేశారని కవిత ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ బీఆర్‌ఎస్‌గా మారి భావసారుప్యత ఉన్న పార్టీలను ఐక్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
2014లో 11 కోట్ల 47 లక్షల మందికి పీఎం కిసాన్ పథకం ఇస్తామని, ఆ సంఖ్య పూర్తిగా తగ్గించారన్నారు. మోడీ పార్లమెంటు ప్రసంగంలో అదానీ వ్యవహారంపై ఎందుకు మాట్లాడ లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీ కోరిన మేరకు తనతో పాటు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎంపీలు, ఐదుగురు మంత్రులు పలువురు ఎమ్మెల్యేల ఇండ్లకు సీబీఐ, ఈడీ వచ్చాయన్నారు. తాను ఏ తప్పు చేయలేదని, మెజారిటీ ప్రతిపక్ష నాయకులు సైతం ఎలాంటి త్పు చేయలేదని కవిత స్పష్టం చేశారు. బీజేపీ కేంద్ర ప్ర భుత్వం అసత్యాలను, ప్రధాని మోడీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ సాగిన కవిత ప్రసంగానికి సభికులు హర్షాధ్వానాలు వ్యక్తం చేశారు.