Friday, November 22, 2024

మార్చి 27న సుప్రీంలో కవిత కేసు.. ఈడీకి వ్యతిరేకంగా పిటిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ)కి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన కేసును సుప్రీంకోర్టు మార్చి 27న విచారణ చేపట్టనుంది. జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేల ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టనుంది. మహిళను ఈడీ కార్యాలయానికి పిలవడం సహా ఈడీ జారీ చేసిన సమన్లు, ఈడీ అధికారుల వ్యవహారశైలిని తప్పుబడుతూ కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

మార్చి 14న కవిత తరఫు న్యాయవాది వందన సెహగల్ పిటిషన్ దాఖలు చేయగా, మార్చి 15న ఈ కేసును త్వరగా విచారణకు స్వీకరించాలని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఎదుట ప్రస్తావించారు. మార్చి 24న విచారణ చేపట్టనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి తొలుత ప్రకటించారు. అయితే కేసును మార్చి 27 నాటి జాబితాలో చేర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement