Thursday, December 5, 2024

TG | పోలీస్ కిష్టయ్య కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత భరోసా..

తెలంగాణ ఉద్యమంలో అమరుడైన పోలీసు కిష్టయ్య కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కలిశారు. కిట్టయ్య 15వ వర్ధంతి సందర్భంగా.. ఆయన భార్య పద్మావతి, కుమారుడు రాహుల్‌ను కలిసిన కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న కవిత.. కృష్ణయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భ‌రోసా ఇచ్చారు.

గతంలో తన కూతురు ప్రియాంకకు వైద్య విద్య కోసం కేసీఆర్ ఆర్థిక సాయం చేశారని పద్మావతి గుర్తు చేయ‌గా… అదే విధంగా భవిష్యత్తులోనూ పోలీసు కిష్టయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందని కవిత హామీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement