వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై ఎమ్మెల్సీ కవిత సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. ‘‘తాము వొదిలిన బాణం. తానా అంటే తందానా అంటున్న తామర పూలు’’ అంటూ షర్మిల, బీజేపీని ఉద్దేశిస్తూ కవిత ట్వీట్ చేశారు. మంగళవారం వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకులతో కలిసి షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి యత్నించగా.. ఈ క్రమంలోనే పంజగుట్ట పోలీసులు వాళ్లు వెళ్తున్న ర్యాలీని సోమాజిగూడలోని యశోద దవాఖాన దగ్గర అడ్డుకున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తి సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని.. తిరిగి వెళ్లిపోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో షర్మిల పోలీసులతో వాగ్వాదానికి దిగారు. డోర్ లాక్ చేసుకుని కారులోనే ఉండిపోయారు. దీంతో పోలీసులు ట్రాఫిక్ క్రేన్‌ను రప్పించి, డ్రైవింగ్ సీట్లో ఆమె కూర్చొని ఉండగానే కారును టోయింగ్ చేస్తూ ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడ బలవంతంగా కారు డోర్లు తెరిచి వైఎస్సార్టీపీ అధినేత్రిని స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. అయితే షర్మిలను అరెస్టు చేయడాన్ని బీజేపీ నేతలతోపాటు కేంద్ర మంత్రి కిషణ్ రెడ్డి ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు’ అంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు.
తాము వదిలిన ‘బాణం’ తానా అంటే తందానా అంటున్న ‘తామర పువ్వులు’… షర్మిలపై కవిత సెటైర్లు
Advertisement
తాజా వార్తలు
Advertisement