Tuesday, November 26, 2024

కత్రినాకి తగ్గని క్రేజ్.. ఒక్క సినిమాకి రూ.12కోట్లు

కత్రీనాకైఫ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20ఏళ్లు అవుతున్నా ఇంకా క్రేజ్ మాత్రం తగ్గలేదు.ఆమె క్రేజ్ కు తగ్గట్లుగా పారితోషికం ను కూడా అందుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు అందుకున్న పారితోషికం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.బాలీవుడ్ లో అతి తక్కువ మంది ముద్దుగుమ్మలు మాత్రమే పది కోట్లు అంతకు మించి పారితోషికం తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కత్రీనా కూడా ఆ జాబితాలో చేరి పోయింది. కత్రీనా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా క్రేజ్ తగ్గలేదు. ఏకంగా రూ.12 కోట్ల ను కత్రీనా ఒక్కో సినిమాకు తీసుకుంటుందని సమాచారం అందుతోంది.

బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సక్సెస్ లు చాలా తక్కువ అయ్యాయి. హిందీ సినిమాల యొక్క బడ్జెట్ గతంతో పోల్చితే ఈ మధ్య కాలంలో చాలా వరకు తగ్గింది. అయినా కూడా కత్రీనా పారితోషికం చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కత్రీనా యొక్క పారితోషికం గురించి ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. కత్రీనా కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న వారు దీపిక పదుకునే .. ఆలియా భట్ గా బాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఇటీవల ఒక సినిమాకు ఐశ్వర్య రాయ్ పది కోట్ల రూపాయల పారితోషికం తీసుకుందట. మిగిలిన వారు మూడు నుండి అయిదు ఆరు కోట్ల పారితోషికం తీసుకుంటున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement