Tuesday, November 19, 2024

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థ వెనుక క‌థ‌….

కొత్త కాన్సెప్ట్‌ చిత్రాలను అందిస్తూ ప్రతిభను ప్రోత్సహిస్తున్న నిర్మాణ సంస్థ దండమూడి బాక్సాఫీస్‌. ఈ బ్యానర్‌పై రూపొందుతోన్న తొలి చిత్రం ‘కథ వెనుక కథ’. విశ్వంత్‌ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్‌, శుభ శ్రీ ప్రధాన తారాగణం. కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రానికి అవనింద్ర కుమార్‌ నిర్మిస్తున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా టీ-జర్‌ను క్రాక్‌, వీర సింహా రెడ్డి వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రూపొందించిన దర్శకుడు గోపీచంద్‌ మలినేని విడుదల చేశారు. ”టీ-జర్‌ ఆకట్టుకునే విధంగా ఉంద ని, సినిమా పెద్ద హిట్‌ కావాలని చిత్ర యూనిట్‌కి అభినందనలు” తెలిపారు.


75 సెకన్ల ‘కథ వెనుక కథ’ టీ-జర్‌ను గమనిస్తే.. ఓ యువ దర్శకుడు (విశ్వంత్‌) మరో పాత్రకు ఓ -కై-మ్‌ కథను చెప్పటంతో టీ-జర్‌ మొదలవుతుంది. సిటీ- చాలా వరకు మిస్సింగ్‌ కేసులుగా నమోదు అవుతున్న అమ్మాయిలను ఎవరో హత్య చేస్తుం టారు. ఇంత భయంకరమైన హత్యలను చేస్తున్న హంతకుడెవరో పోలీసులకు అంతు చిక్కదు. దీంతో వారు కేసుని సత్య (సునీల్‌) అనే సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌కి అప్పగిస్తారు. సిటీ-లో జరుగుతున్న హత్యలకు ఓ వ్యక్తి కారణం కాదని, ఓ గ్యాంగ్‌ కలిసి ఈ హత్యలను చేస్తుందని సత్యకు తెలుసుకుంటాడు. మరి ఈ విషయాన్ని సత్య ఎలా కనుక్కుకున్నాడు.. అతను టీ-జర్‌లో చెప్పినట్లు- మిస్‌ అయిన ఓ పాయింట్‌ ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే కథ వెనుక కథ టీ-జర్‌ను గమనించాల్సిందే.
టీ-జర్‌లో పోలీసుల ఇన్వెస్టిగేషన్‌ ప్రకారం విశ్వంత్‌ పాత్ర పజిలింగ్‌గా అం దరూ అనుమాన పడేలా కనిపిస్తుంది. మరో వైపు ఇదే క్యారెక్టర్‌ 2019లో జరిగిన దిశ రేప్‌, మర్డర్‌ కేసు గురించి చెప్పటం అప్పుడు ప్రజల్లో నుంచి వచ్చిన ఎమోషనల్‌ రియాక్షన్స్‌, పోలీసులు చూపించిన యాక్షన్‌ గురించి ప్రస్తావన ఉంటు-ంది. అసలు వరుస హత్యల వెనుకున్న సీరియల్‌ లింకును సునీల్‌ ఏం మిస్‌ చేసుకున్నాడు అనేది ఇం-టె-స్టింగ్‌గా ఉంది. సునీల్‌, విశ్వంత్‌ పాత్రలు చాలా ఆసక్తికరంగా కనిపిస్తు న్నాయి. పోలీసులు చేసే ఇంటరాగేషన్‌, ప్రొసీజర్స్‌, పోర్షన్స్‌, బ్యాక్‌డ్రాప్‌ అనేది ఇంట్ర స్టింగ్‌గా అనిపిస్తుంది. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ తెలి యజేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement