నటి కశ్మీర పరదేశి పలు ప్రచార చిత్రాల్లో నటించింది. మరాఠీకి చెందిన ఈ భామ గతంలో నాగశౌర్య నటించిన తెలుగు చిత్రం ‘నర్తనశాల’ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు జిఎ2 నిర్మిస్తున్న ‘వినరో భాగ్య ము విష్ణు కథ’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి అల్లు అరవింద్ సమర్పకులు. 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకువస్తోంది. ఈ సందర్భంగా కశ్నీర పరదేశి మీడియాతో చిత్ర విశేషాల గురించి గురించి మాట్లాడారు.
ఈ సినిమాకు నేపథ్యం తిరుపతి. పుణ్యక్షేత్రం తిరుపతి అనగానే ఎంతో పవిత్రంగా భావించి ఈ చిత్రం చేశాను. సినిమా ప్రధాన భాగం చిత్రీకరణ తిరుపతిలో జరిగింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఎంతో సహకారం అం దించింది అని కశ్మీర పరదేవి చెప్పింది. నిజానికి నాకు ఇదొ క కొత్త అనుభవం. గతంలో నేను నటించిన కమర్షియల్ ప్రకటనలు నాకు ఈ సినిమాలో నటించేందుకు నాకు నటన పరంగా ఉపయోగపడ్డాయి అని తెలిపింది.తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను తెలుగు కొంచెం కొంచెం అర్థమవుతుంది అని చెప్పింది. ” వినరో భాగ్యము విష్ణుకథ చిత్రంలో నా పాత్ర పేరు దర్శన. నటనకు అవకాశం ఉన్న పాత్ర. భాష ఏదైనా సరే నటిస్తున్నప్పుడు హావభావాలు చాలా ముఖ్యం. భాష కాదు ముఖ్యం. పాత్ర ఏదైనా దానికి న్యాయం చేయాలనేది నా పాలసీ.” అని తెలిపింది. చిత్ర హీరో కిరణ్ అబ్బవరం గురించి చెబుతూ ” కిరణ్‌తో చాలా హ్యాపీ జర్నీ. అతను చాలా మంచి వ్యక్తి. కొన్ని సందేహాలను అతని ద్వారా తీల్చుకున్నాను. కిరణ్ చాలా నైస్ పర్సన్” అని చెప్పింది. ”గీతా ఆర్ట్స్ లో పనిచేయడం చాలా కంఫర్ట్ బుల్‌గా ఉంటు-ంది. సినిమాలోని సీనియర్ నటు-లనుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సినిమా నాకు తప్పకుండా కమ్‌బ్యాక్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను.” అని కశ్మీర పేర్కొంది.