Saturday, November 23, 2024

కార్వీ ఎండీకి రెండు రోజుల పోలీస్ కస్టడీ

రుణాల ఎగవేత కేసులో అరెస్ట్ అయిన కార్వీ ఎండీ పార్ధసారథిని పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు ఆయన్ను విచారించేందుకు అంగీకారం తెలిపింది. ప్రస్తుతం పార్ధసారథి చంచల్‌ గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

ఈనెల 25 ,26 తేదీల్లో పోలీసులు పార్ధసారథిని విచారించనున్నారు. బుధవారం జైలు నుండి కస్టడీలోకి తీసుకుంటారు పోలీసులు. కస్టమర్ల షేర్లను కంపెనీ షేర్లుగా నమ్మించి పలు బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలు రుణాలు పొందింది కార్వీ సంస్థ. ఈ నేపథ్యంలోనే పార్ధసారథిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనపై నమోదు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని పార్ధసారథి సోమవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే దీనిపై సీసీఎస్‌ పోలీసులు రీ కౌంటర్‌ దాఖలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement