జీవిత భాగస్వామి మార్పిడికి సంబంధించిన కేసులో కేరళలోని కారుకాచల్ పోలీసులు ఏడుగురిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో బాధితురాలి భర్తకూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తన భర్త బలవంతంగా ఇతర పురుషులతో అసహజ సెక్స్‌కు ప్రేరేపిస్తున్నాడని ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఆమె ఫిర్యాదుపై విచారణ చేపట్టగా ఈ ముఠా గుర్టు రట్టయింది. సదరు మహిళ ఇతర పురుషులతో అసహజ సెక్స్‌కు పాల్పడాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : లాక్‌డౌన్‌పై నిర్ణయాధికారం రాష్ట్రాలదే..
ఇతరులతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని సదరు భర్త ఆ మహిళను బలవంతం చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయంపై తదుపరి విచారణ గ్యాంగ్ గుట్టును రట్టుచేసింది. ముఠా సభ్యులు ఒకరినొకరు సంప్రదించడానికి టెలిగ్రామ్, మెసెంజర్ యాప్‌లను ఉపయోగించారు. నిందితులను కొట్టాయం, అలప్పుజ, ఎర్నాకులం జిల్లాల్లో అదుపులోకి తీసుకున్నారు. చాట్ గ్రూపుల్లో వేలాది మంది సభ్యులు ఉన్నందున సమగ్ర విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital