బెంగళూరు – కర్ణాటక మాజీ మంత్రి, రాజరాజేశ్వరి నగర్ ఎమ్మెల్యే, బీజేపీ నేత మునిరత్న నాయుడి పై కొందరూ గుర్తు తెలియని వ్యక్తులు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఎమ్మెల్యే అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకి వచ్చి వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల్లో పాల్గోన్నారు. ఈ వేడుక అనంతరం మునిరత్నం తిరిగి వెళుతుండగా.. కొందరు వ్యక్తులు అతడిపై గుడ్లతో దాడి చేశారు. స్పందించిన పోలీసులు . ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై మునిరత్న స్పందిస్తూ.. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ అతని తమ్ముడు తనను చంపడానికి కుట్ర పన్నారని , దీనిలో భాగంగానే తనపై కోడిగుడ్లతో దాడి చేశారని తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement