ఓ శాడిస్ట్ భర్త మద్యం మత్తులో తన భార్య ముక్కు కొరికేశాడు. కర్ణాటకలో ధార్వాడ్ లోని జరిగింది ఈ ఘటన. అమ్మినబావి గ్రామానికి చెందిన ఉమేశ్, గీత దంపతుల మధ్య చాలాకాలంగా మనస్పర్థలున్నాయి. కొద్ది రోజుల క్రితం గీత తన పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే ఫూటుగా మద్యం తాగి అక్కడికి వెళ్లిన ఉమేశ్.. తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ క్రమంలోనే కిరాతకంగా ఆమె ముక్కు కొరికేశాడు. అనంతరం అత్తపై కూడా దాడి చేశాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన గీతను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: తమిళనాడు గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి