ముడా భూముల స్పామ్ పై విచారణ ఎదుర్కొవలసిందే
గవర్నర్ ఆదేశాలపై జోక్యం చేసుకోం
గవర్నర్ నిర్ణయం సబబే
సిద్దరామయ్య పిటిషన్ కొట్టివేసిన కర్నాటక హైకోర్టు
బెంగళూరు – కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ షాక్ ఇచ్చింది కర్ణాటక హైకోర్టు. ముడా భూ కుంభకోణం కేసులో విచారణకు అనుమతి ఇచ్చిన కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ముఖ్యమంత్రి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ రాష్ట్ర మంత్రి వర్గం అనుమతి లేకుండా ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోలేరని సిద్ధరామయ్య వాదించారు. అక్రమంగా ఇతరత్రా భూముల మంజూరుకు సంబంధించి ముఖ్యమంత్రి ఎక్కడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సింఘ్వీ కోర్టుకు గతంలో చెప్పారు. అయినప్పటికీ ఈ వాదనను పరిగణనలోకి న్యాయమూర్తి తీసుకోలేదు..
సిద్ది పిటిషన్ ను ఈ రోజు తోసిపుచ్చింది జస్టిస్ ఎం నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం..” ఈ కేసులో గవర్నర్ తన బుద్ధిని పూర్తిస్థాయిలో అన్వయించారని, అందువల్ల ముఖ్యమంత్రిపై విచారణకు స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చు” అని పేర్కొంది. ”గవర్నర్ చర్యలో ఎలాంటి తప్పు లేదు. వాస్తవాలపై విచారణ అవసరం. పిటిషన్ కొట్టివేయబడింది” అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అలాగే విచారణకు సిద్ద సంపూర్ణంగా సహకరించాలని ఆదేశించారు న్యాయమూర్తి.