కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా ఉత్తర కన్నడ జిల్లా షిరూర్‌లోని అంకోలా హైవేపై మంగళవారం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. మృతులు 66వ నెంబరు జాతీయ రహదారిపై రోడ్డు పక్కనే చిన్నపాటి హోటల్ నడుపుతున్న కుటుంబ సభ్యులుగా గుర్తించారు.
మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో ఓ గ్యాస్ ట్యాంకర్ సమీపంలోని గంగావళి నదిలో పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య ఏడుకు చేరింది. కొండచరియలు విరిగిపడటంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.