Tuesday, October 29, 2024

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార‌స్వామికి క‌రోనా

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కేసులు వేలల్లో వస్తున్నాయి. క‌ర్ణాట‌క‌లో నిన్న ఒక్క‌రోజే కొత్త‌గా 14,859 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 9,917 కేసులు ఒక్క బెంగ‌ళూరులోనే న‌మోదైన‌ట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. 24 గంట‌ల్లో క‌రోనాతో 78 మంది మ‌ర‌ణించ‌గా, ఒక్క బెంగ‌ళూరులో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. క‌ర్ణాట‌క‌లో ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,07,315. మొత్తం కేసుల సంఖ్య 11.24 ల‌క్ష‌ల‌కు చేరుకోగా, మ‌ర‌ణాల సంఖ్య 13,190కి చేరింది.

తాజాగా క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి హెచ్‌డీ కుమార‌స్వామి క‌రోనా బారిన ప‌డ్డారు. త‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌ని కుమార‌స్వామి ఈ ఉద‌యం ట్వీట్ చేశారు. త‌న‌ను ఇటీవ‌ల క‌లిసిన వారంతా కొవిడ్ టెస్టులు చేయించుకోవాల‌ని, హోం ఐసోలేష‌న్‌లో ఉండాల‌ని కుమార‌స్వామి విజ్ఞ‌ప్తి చేశారు. క‌ర్ణాట‌క సీఎం యెడియూర‌ప్ప కూడా క‌రోనా బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. యెడియూర‌ప్ప‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డం ఇది రెండోసారి.

Advertisement

తాజా వార్తలు

Advertisement