బెంగుళూరు – మే 10వ తేదీన జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. బీజేపీ తన మ్యానిఫెస్టో విడుదల చేసిన తదుపరి రోజు కాంగ్రెస్ తన హామీల పత్రాన్ని విడుదల చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దారామయ్య, మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ డాక్టర్ పరమేశ్వరజీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొంది. ఇందులో భాగంగానే బజరంగ్ దళ్, పీఎఫ్ఐలను నిషేధిస్తామని తెలిపింది. ప్రజా వ్యతిరేక, అన్యాయ చట్టాలను రద్దు చేస్తామని వివరించింది. అలాగే, గృహ జ్యోతి, గృహ లక్ష్మీ, అన్న భాగ్య, యువ నిధి, శక్తి అనే మూడు హామీలను ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశాన్ని కల్పిస్తామని తెలిపింది. ఇంటి పెద్దగా ఉన్న మహిళలకు రూ. 2,000 చొప్పున గృహ లక్ష్మీ స్కీమ్ కింద అందిస్తామని వివరించింది.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలోని హామీలు ….
ప్రతి గ్రామ పంచాయతీలో భారత్ జోడో సామాజిక సామరస్య కమిటీల ఏర్పాటు
పాత పింఛన్ విధానం కొనసాగింపు.
2006 తర్వాత విధుల్లో చేరిన అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పథకం
ప్రత్యేక చట్టాల ద్వారా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, పవర్ సెక్టార్లలో అవినీతి నిర్మూలన
నైట్ డ్యూటీ చేసే పోలీసులకు నెలకు రూ. 5,000 ప్రత్యేక అలవెన్స్
బిజేపీ తెచ్చిన ప్రజా వ్యతిరేక, అన్యాయ చట్టాలను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రద్దు
ద్వేషాన్ని వ్యాప్తి చేసే వ్యక్తులు, సంస్థలు, బజరంగ్ దళ్, పీఎఫ్ఐ సహా ఇలాంటి ఆర్గనైజేషన్లపై కఠిన చర్యలు, అవసరమైతే బ్యాన్ కేఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం
రిజర్వేషన్ పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచి అన్ని వర్గాలకు అవకాశాలు
కల్పనయువ నిధి స్కీం కింద నిరుద్యోగులకు రూ. 3,000 జీవన భృతి