లైంగిక వేధింపుల కేసులో జెడి(ఎస్) ఎమ్మెల్సీ, ఎంపి ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు సూరజ్ రేవణ్ణకు కర్ణాటక కోర్టు (సోమవారం) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. సూరజ్ రేవణ్ణ తన పాస్‌పోర్టును సరెండర్ చేసి క్రమం తప్పకుండా విచారణకు హాజరుకావాలని, అనుమతి లేకుండా రాష్ట్రం బయటకు వెళ్లరాదని కోర్టు అదేశించింది.
పార్టీ కార్యకర్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై సూరజ్ రేవణ్ణను హాసన్ పోలీసులు జూన్ 23న అరెస్టు చేశారు. సూరజ్ రేవణ్ణ సోదరుడు ప్రజ్వల్ రేవణ్ణ కూడా లైంగిక వేధింపుల కేసులో జైలులో ఉన్నారు.