కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన స్కాం
విచారణ జరిపిన లోకాయుక్త కోర్టు
అక్రమాలు చేశారనడానికి ఆధారాలు లేవని స్పష్టీకరణ
సిద్ధరామయ్య భార్యకు కూడా క్లీన్ చిట్
బెంగళూరు – గత కొన్ని నెలలుగా కర్ణాటక రాజకీయాల్లో దుమారం రేపిన ముడా హౌసింగ్ స్కాంలో సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణ జరుపుతున్న లోకాయుక్త కోర్టు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నేడు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో పసలేదని తేల్చింది. ముఖ్యమంత్రి అక్రమాలకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. అంతేకాదు, ఈ వ్యవహారంలో సిద్ధరామయ్య భార్యకు కూడా ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇక లోకాయుక్త కోర్టు జరిపిన విచారణ నివేదికను సోమవారం నాడు కర్ణాటక హైకోర్టుకు సమర్పించనుంది.
- Advertisement -