Sunday, January 5, 2025

Karnataka కేబినెట్ కీలక నిర్ణయం.. పెరిగిన బస్సు చార్జీలు !

సిద్ధరామయ్య నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వంలో త్వరలో బస్సు ప్రయాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. ఛార్జీల పెంపునకు ఆ రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఈరోజు (జనవరి 2న) జరిగిన కర్ణాటక కేబినెట్ లో బస్సు చార్జీలను 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 5 నుంచి బస్సు చార్జీలు పెరగనున్నాయి.

కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NWKRTC), కళ్యాణ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (KKRTC), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BMTC) నాలుగు రాష్ట్ర రవాణా సంస్థల బస్సు ఛార్జీలను కర్ణాటక క్యాబినెట్ పెంచింది. 15 శాతం పెంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఛార్జీల పెంపునకు గల కారణాన్ని న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ వివరిస్తూ.. ఇంధన ధరలు, ఉద్యోగులపై వ్యయం వంటి నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement