Tuesday, November 26, 2024

కర్ణాటక కొత్త సీఎం ఎవరు?.. కిషన్ రెడ్డికి ఎంపిక బాధ్యత

ముఖ్యమంత్రి పదవికి యుడియూర్ప రాజీనామా చేసిన తర్వాత కర్ణాటక రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు ? అన్నది ఉత్కంఠగా మారింది. సీఎం రేసులో ఇప్పటికే పలువురు సీనియర్లు ఉన్నారు. కర్ణాటక కొత్త సీఎం ఎంపిక ప్రక్రియ బీజేపీ అధిష్టానం ప్రారంభించింది. కొత్త సీఎం ఎంపిక కోసం పార్టీ పరిశీలకుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బెంగళూరులో మకాం వేశారు. బీజేఎల్పీ మీటింగ్ తర్వాత కొత్త సీఎం పేరును ప్రకటించే అవకాశం ఉంది.  తదుపరి సీఎంగా పలువురు ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ మంత్రి సదానంద గౌడ పేర్లు వినిపిస్తున్నాయి. సీఎం పోస్టు తమకే ఇవ్వాలని బ్రాహ్మణ, పంచమశాలి లింగాయత్‌, దళిత సామాజిక వర్గాల నుంచి డిమాండ్లు వస్తున్నాయి.  కిషన్ రెడ్డితోపాటు మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కూడా పరిశీలకుడిగా వచ్చారు. వీరిద్దరు కలిసి రాత్రి 7.30 గంటలకు బీజేఎల్పీ మీట్ నిర్వహిస్తారు. అందులో సభ్యుల అభిప్రాయం కోరతారు. తర్వాత సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారు. ఇప్పటివరకు అయితే జగదీశ్ షెట్టర్, మురుగేశ్ నిరాణి, డిప్యూటీ సీఎంలు లక్ష్మణ్ సవాడీ, సీఎన్ అశ్వత్ నారాయణ్ రేసులో ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement