కరీంనగర్ : తెలంగాణ స్వరాష్ట్రంలో ఎక్కడ చూసినా అద్భుతంగా అభివృద్ధి కొనసాగుతుందని బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ 25వ డివిజన్ లో 60 లక్షల అభివృద్ధి పనులకు నగర మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో శివారు కాలానీల్లో అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిసాన్ నగర్ లో ఎక్కడ చూసిన గుంతల రోడ్లు.. రోడ్ల మీద విద్యుత్ స్థంబాలు.. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉండేవన్నారు. స్వరాష్ట్రంలో వేల కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. కిసాన్ నగర్ లో వేల కోట్లతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కేసీఆర్ ఒక్కడే కాపాడుతారని.. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ కి ఆడబిడ్డలు అండగా నిలవాలని ఆకాంక్షించారు.
బీజేపీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం..
మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాజస్థాన్ లో రోడ్లు లేవని మంత్రి ఎద్దేవ చేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై.సునీల్ రావు, కార్పొరేటర్లు ఎడ్ల సరిత – అశోక్, కుర్ర తిరుపతి, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్ఈ నాగమల్లేశ్వర రావు, బోనాల శ్రీకాంత్, అయిలందర్ యాదవ్, గందె మహేష్ తదితరులు పాల్గొన్నారు.