Tuesday, November 26, 2024

అన్ని కులాలకు, మతాలకు వేదిక కరీంనగర్ : మంత్రి గంగుల

తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల వారు కలిసి మెలిసి సంతోషంగా జీవిస్తున్నారని బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ సింది భవన్ లో సింధ్ కులస్థుల ఆరాధ్య దైవం అయిన చీటీ చంద్ జూలే లాల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్యతిథిగా మంత్రి గంగుల కమలాకర్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. కరీంనగర్ అన్నికులాలకు, అన్ని మతాలకు వేదిక అన్నారు. నగరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసి మెలిసి జీవిస్తున్నారని.. సవ్యంగా వారివ్యాపారాలు నిర్వ‌హించు కుంటున్నారని అన్నారు. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని వెల్లడించారు. 15 సంవత్సరాల నుండి నగరంలో 144 సెక్షన్, క‌ర్ఫ్యూలు, అల్లర్లు, చంధాలు, దందాలు లేవని వెల్లడించారు. సింధ్ కమ్యూనిటీ హాల్ కు ప్రభుత్వ భూమి తో పాటు 60లక్షల నిధులు కేటాయిస్తున్నట్టు మంత్రి వెల్లడించారు. ఈ కార్య‌క్ర‌మంలో నగర మేయర్, సునీల్ రావు, గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనిల్ గౌడ్, కార్పొరేటర్లు పిట్టల వినోద-శ్రీనివాస్, వంగల శ్రీదేవి -పవన్, తోట రాములు, ఏవీ రమణ, ప్రేమ్ కుమార్ ముందడా,అర్బన్ బ్యాంకు డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్, సుడా డైరెక్టర్ నేతి రవి వర్మ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement