ఆంధ్రప్రభ స్మార్ట్, ఉమ్మడి కరీంనగర్ : రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ రోజు రాఖీ పండుగ, ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తన ఇంటివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారానికి, వాస్తవానికి పొంతనే లేదన్నారు. రూ.40 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పి కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు. ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయకుండ మోసం చేశారని, ఇవన్నీ అడుగుతుంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమంటూ కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.
చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. . రుణమాఫీ పూర్తిగా చేస్తారా చేయరా చెప్పండి అని ప్రశ్నించారు. ఇటీవల చనిపోయిన రైతులకు కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. నలబై వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నారు ఇంతవరకు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు.
ముఖ్యమంత్రి పదవి కోసం చాలా మంది కలలు కంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ పార్టీ అవినీతి పార్టీని మేము చేర్చుకోమన్నారు. కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టాలి .. కానీ ఇంతవరకు పెట్టలేదన్నారు. విలీనం అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నారు.. అప్పట్లో కాంగ్రేస్ లో బీఆర్ఎస్ ని విలీనం చేస్తా అని మాట తప్పాడన్నారు. కేటీఆర్ బతుకు ఎటుగాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ పై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఫోటో జర్నలిస్టులకు శుభాకాంక్షలు
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటో జర్నలిస్టులందరికీ కేంద్ర మంత్రి బండి శుభాకాంక్షలు తెలిపారు. వెయ్యి పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క ఫొటో చెబుతుందన్నారు. లక్ష అక్షరాల సారాంశాన్ని ఒకే ఒక్క ‘చిత్రం’ ఆవిష్కరిస్తుందని పేర్కొన్నారు. దేశంలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ తన కంటితో ప్రపంచానికి చూపించే ఫోటో జర్నలిస్ట్ నిరంతర శ్రామికుడని, ఎన్నో శారీరక, భౌతిక దాడులు, మానసిక ఒత్తిళ్ళను తట్టుకుని ఎంతో శ్రమకోర్చి తీసిన ఫొటోలను ప్రపంచానికి చూపించే ఫొటో జర్నలిస్టు సేవలు నిజంగా మరువలేనివి పేర్కొన్నారు.