Friday, November 22, 2024

Kargil Earthquake: కార్గిల్‌లో భారీ భూకంపం.. భయాందోళనలో ప్రజలు..

కార్గిల్ లో భారీ భూకంపం సంభ‌వించింది. రెక్టార్ స్కేల్ పై ఏకంగా 4.3 తీవ్రత న‌మోద‌వ్వ‌డంతో ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేసింది. ఒక్క‌సారిగా భూమి కంపించ‌డంతో ప్ర‌జ‌లు రోడ్ల‌పైకి ప‌రుగులు తీశారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లోని కార్గిల్‌ను భూకంపం వణికించింది. సోమవారం ఉదయం రిక్టర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ తెలిపింది. కార్గిల్‌కు 64 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే, భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లుగా నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement