నాటు నాటు పాటపై బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ తన స్పందన తెలిపింది.తన రెండేళ్ల చిన్న కొడుకు జహంగీర్ నాటు నాటు పాటకి మస్త్ ఫ్యాన్ అయిపోయాడు. ప్రస్తుతం కరీనా కపూర్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. రోజులో ఎన్ని సార్లు పాట పెట్టినా బోర్ అనుకోకుండా వినేస్తాడట.. అంతే కాదు ఈ పాట ఎంతలా నచ్చేసిందంటే.. ఆ పాట పెట్టకపోతే అన్నం మానేసేంతగా ప్రభావితం అయిపోయాడట. తన కొడుకు నాటు నాటు పాటకు డ్యాన్స్ వేయడాన్ని ఎంతో ఇష్టపడతాడని.. ఆ పాట ప్లే చేయకపోతే అన్నం కూడా తినడని కరీనా కపూర్ రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో వెల్లడించింది. అంతే కాదు ఇక్కడో చిన్న ట్విస్ట్ కూడా ఉంది. కరీనా తనయుడు నాటు నాటు పాట హిందీ వర్షన్ లో వినడట.. అచ్చ తెలుగు పాట అయితేనే ఆ కిక్ వస్తుందట.. అందుకే తెలుగుపాట పెడితేనే ఎంజాయ్ చేస్తాడట.. వేరే లాంగ్వేజ్ లో నాటు నాటు పెడితే.. వద్దని మారాం చేస్తాడట ఈ బుడ్డోడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement