హైదరాబాద్ ,ఆంధ్రప్రభ బ్యూరో : కర్ణాటక అసెంబ్లి ఎన్నికల ఫలితాలు శనివారం (రేపు) వెలువడుతున్న వేళ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలలో బెట్టింగ్ రాయుళ్లు రంగంలోకి దిగారు. వివిధ వార్తా సంస్థలు,మీడియా చానళ్ళు సర్వే ఏజెన్సీలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించగా మరి కొన్ని చానళ్ళు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ప్రకటిం చాయి. #హంగ్ ఏర్పడితే జనతా దళ్ సెక్యులర్ కీలకం అవుతుందని కూడా కొన్ని సంస్థలు జోస్యం చెబుతు న్నాయి. కర్ణాటక ఎన్నికలపై ఆది నుంచి తెలుగు రాష్ట్రాల్లో జోరుగా బెట్టింగ్‌లు సాగుతుండగా పోలింగ్ ఘట్టం ముగిశాక ఈ జోరు మరింత పెరిగిందని ప్రచారం జరుగుతోంది.
పోలింగ్ ముగిసిన తర్వాత.. కర్ణాటకలో గెలుపె వరిది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు అంటూ బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. పోలింగ్ ముందు వరకు ఒక అం చనాతో ఉన్న బెట్టింగ్ రాయుళ్లు.. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ చూసి కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇంతకు ముందు వేసిన బెట్టింగ్స్ ను కొంతమంది మార్చుకుం టుంటే ఇంకొందరు.. బెట్టింగ్ పెట్టిన మొత్తాలను పెంచేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ బెట్టింగ్ రాయుళ్లు నమ్ముతుండటం విశేషం. ఎందుకంటే బీజేపీనే గెలుస్తుందని ఎంతమంది నమ్ముతున్నారో.. అంతే మొత్తంలో బీజేపీ ఓడి కాంగ్రెస్ గెలుస్తుందని బెట్లు కాస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ పందెం రాయుళ్ల కోసం ఎదురు చూస్తున్నారు బెట్టింగ్ బాబులు.. రకరకాలుగా బెట్టింగ్స్ కడుతున్నారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి? కాంగ్రెస్ ఎన్నిసీట్లు సాధిస్తుంది? జేడీ ఎస్ పరిస్థితి ఏంటి? కర్ణాటకలో వచ్చేది ఏ ప్రభు త్వం..? సీఎం అయ్యేది ఎవరు? కింగ్ ఎవరు? కింగ్ మేకర్‌గా మారేది ఎవరు? అనే వాటిపై బెట్టింగ్ జరు గుతోంది. వీటితోపాటు ఎక్కువ అసెంబ్లిd స్థానాలు సాధించే పార్టీ మీద కూడా పెద్ద ఎత్తున పందేలు కాస్తు న్నట్టు సమాచారం ఎగ్జిట్ పోల్స్ చూసుకున్న కొందరు అంతకు ముందు తాము కట్టిన పందేలలో నష్టపోకుండా ఉండేందుకు రివర్స్ బెట్టింగ్ వేస్తున్నారు. అంటే.. గతంలో ఒక పార్టీ విజయంపై బెట్టింగ్ వేసిన వాళ్లు.. ఎగ్జిట్‌పోల్స్ ఆ పార్టీకి ఇచ్చిన సీట్లు చూశాక.. నష్ట నివారణ కోసం కోసం ఇంకో పార్టీ గెలుస్తుందని పందేలు వేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ ను దగ్గర పెట్టుకుని వాటి యావరేజ్ ఎంత? మొత్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావోచ్చు అనే దానిపై లెక్కలు కడు తున్నారు.
రాజకీయ విశ్లేషకులను మించిన విశ్లేషణలు చేస్తున్నారు. బెట్టింగ్ వేసిన వాళ్లంతా.. ఫలితాల అంచనాలలో తలమునకలై పోయారు. హైదరాబాద్, ఏపీలోని విజయవాడ, వైజాగ్ గుంటూరు,నెల్లూరు భీమవరం, కాకినాడ అనంతపురం,కర్నూల్ కేంద్రంగా బెట్టింగ్స్ జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు పొరుగున ఉన్న రాయచూర్, గుల్భర్గా, బీదర్‌తో పాటు #హదరాబాద్, గద్వాల, మహబూబ్ నగర్, కొడంగల్, నారాయణ పేట, మక్తల్ తదితర ప్రాతాల్లోనూ బెట్టింగ్ రాయుళ్లు డబ్బు సంచులతో తిరుగుతున్నట్టు తెలుస్తోంది.కోట్ల రూపాయల్లోనే బెట్టింగ్‌లు జరుగుతు న్నట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని అధికారాన్ని చేపడు తుందని హదరాబాద్‌కు చెందిన ఒక నేత ఏకంగా మూడు కోట్ల రూపాయల పందెం కాసినట్టు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సీఎం అవు తారన్న అంశంలో కోట్ల రూపాయల బెట్టింగులు కాస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటితే తెలంగాణలోనూ ఆ పార్టీ అధికారాన్ని #హస్త గతం చేసుకుంటుందని కూడా పందాలు కాస్తున్నారు. ఏపీ కి చెందిన పారిశ్రామిక వేత్తలు నలభై ఏళ్ళ క్రితం కర్ణాటక లోని బళ్లారి, సింధనూర్, రాయచూర్ ప్రాంతాలకు వెళ్లి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారి నుంచి ఓటింగ్ జరిగిన సరళిని తెలుసుకుని వారి నుంచి వచ్చే సమాచారం పరిగణలోకి తీసుకుని బెట్టింగు లకు దిగుతున్నారు. భాజపా గెలిచి అధికారం చేపడుతోందని ఇక్కడి నాయకులు పందాలు కాస్తు న్నారు. మరి శనివారం జరిగే ఓట్ల లెక్కింపులో విజయం ఏ పార్టీని వరిస్తుంది అధికారం కైవసం చేసుకునే పార్టీ ఏది? మేజిక్ ఫిగర్ ఎవరికీ రాని పక్షంలో చక్రం తిప్పేదెవరన్నది తేలుతుంది. బెట్టి ంగ్ రాయుళ్లు మునుగుతారా గెలిచి తేలుతారా అన్నది మరి కొన్ని గంటలలోతేలిపోనుంది