చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న కన్నడ మూవీ కాంతార.. ఈ సినిమాలోని వరాహరూపం.. దైవ వరిష్ఠం.. పాటకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. క్లైమాక్స్‌లో ఈ పాటలో రిషబ్ శెట్టి రూపం చూసి ఒళ్లు జలదరించని ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తికాదు. అలాంటి నృత్యరూపకాన్ని ఎలా తీశారో చెబుతూ లిరికల్ వీడియోను చిత్ర నిర్మాణ హోం బాలే ఫిల్మ్స్ పంచుకుంది. సంప్రదాయ వాద్యాలతో సంగీత దర్శకుడు అజనీశ్ లోకనాథ్ స్వరాలు సమకూర్చడంతో మొదలైన పాట ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దారు. ఆ పాటను దర్శకుడు, నటుడు రిషబ్‌శెట్టి తెరకెక్కిస్తున్న సన్నివేశాలు, ఆ పాత్రల్లో వివిధ నటులు కనిపించిన తీరు అద్భుతంగా ఉంది. ఈ పాటకు షాషిరాజ్ కవూర్ సాహిత్యం అందించగా, సాయి విఘ్నేష్ ఆలపించారు.కేవలం ఐదు రాత్రుల్లో క్లైమాక్స్ సన్నివేశాలను తీర్చిదిద్దారు రిషబ్‌శెట్టి. వరుసగా చిత్రీకరణ జరపటం వల్ల ఒళ్లు హూనమైనా దైవం ఆవహించిన సన్నివేశాల్లో ఆ అలసట ఏమాత్రం కనిపించనీయకుండా నటించిన విధానం మెప్పిస్తోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement