డైనమిక్ స్టార్ విష్ణు మంచు తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కన్నప్ప రోజురోజుకూ పాన్ ఇండియా స్థాయిలో హైప్ ని పెంచుకుంటూ పోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక్కో అప్డేట్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ పౌరాణిక చిత్రంలో భాగం కానున్నారు.
తాజాగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ కన్నప్ప తారాగణంలో చేరినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో సూపర్‌స్టార్‌ని కనిపించబోతోన్నారని సమాచారం. విష్ణు మంచు స్వయంగా తన అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో శివ రాజ్‌కుమార్ కన్నప్పలో భాగమని పేర్కొన్న వార్తాని రీ ట్వీట్ చేశారు. శివ రాజ్‌కుమార్ పాత్రకు సంబంధించిన అప్ డేట్‌ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది.
అంతే కాకుండా.. లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్టు తెలుస్తోంది.. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇలా ప్రతీ ఇండస్ట్రీలోని సూపర్ స్టార్ ‘కన్నప్ప’లో భాగస్వామి అవుతుండటంతో అందరి ఫోకస్ ఈ మూవీపైనే ఉంది.
బుల్లితెరపై ‘మహాభారతం’ సీరియల్‌ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ బిగ్ బడ్జెట్ ‘కన్నప్ప’ మూవీని తెరకెక్కిస్తున్నారు. శివ భక్తుడైన ‘కన్నప్ప’ కథను ఆధారంగా తీసుకుని చేస్తున్న ఈ మూవీలో ‘కన్నప్ప’గా మంచు విష్ణు కనిపించబోతోన్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ వంటి రచయితలు పనిచేశారు.