కన్నడ క్రేజీ హీరో పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమించి గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి వచ్చేసరికే ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. కాగా పునీత్ రాజ్ హార్ట్ ఎటాక్ తో మరణించినట్లు డాక్టర్లు ప్రకటించారు. ఈరోజు ఉదయం జిమ్ లో వర్క్ వుట్స్ చేస్తుండగా ఆయనకి హార్ట్ ఎటాక్ రావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఆస్పత్రికి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, హీరో యశ్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు చేరుకోవడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. కన్నడంలో స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
దీంతో అభిమానులు విక్రమ్ ఆస్పత్రి దగ్గరకు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించింది. పునీత్ రాజ్ కుమార్ చికిత్స పొందుతున్న విక్రమ్ ఆస్పత్రికి వెళ్లే మార్గాలను మూసేసింది. ఆస్పత్రిలో పాటు బెంగళూరులోని ప్రధాన మార్గాలు, కూడళ్లలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సినిమా ధియేటర్లను మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.. కన్నడ దిగ్గజ నటుడు రాజ్ కుమార్ మూడో కుమారుడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన పునీత్ రాజ్ కుమార్.. అత్యంత సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
1985లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించిన పునీత్..ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా మారిన ఆయన ఇప్పటివరకు దాదాపు 29కి పైగా సినిమాల్లో నటించారు.