కాణిపాకం – శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి.. నేటి నుంచి 21 రోజులు అంగరంగ వైభవంగా జరగనున్న స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ వి.ఎన్.మణికంఠ చందోలు, , చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ ఇతర ఉన్నతాధికారులు, భక్తుల సమక్షంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు, ప్రజా ప్రతినిధులకు ఆలయ ఈవో, అర్చకులు, వేదపండితులు ఆధ్యాత్మిక వాతావరణంలో వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి, శుభాశీస్సులు అందజేశారు. అనంతరం వారు స్వామివారి దివ్య సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తరువాత, వేదపండితులు ఆలయంలో ఆశీర్వచనం అందజేశారు. స్వామి వారి తీర్థ
ప్రసాదాలు, చిత్రపటాలు అందజేశారు.
- Advertisement -