Friday, November 22, 2024

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కంగనా.. నాపై కూడా యాసిడ్ దాడి చేస్తారేమో

వివాదాస్ప‌ద న‌టిగా పేరు తెచ్చుకుంది బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నార‌నౌత్. తాజాగా సోషల్ మీడియా వేదికగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు కంగనా రనౌత్. .. ప్రస్తుత సమాజంలో ఒక అమ్మాయి ప్రేమకు నో చెబితే వారిపై యాసిడ్ దాడులు జరగడం మనం చూస్తున్నాం. ఈ క్రమంలోనే ఈ యాసిడ్ దాడుల గురించి నాకు కూడా భయంగా ఉంది అని అన్నారు కంగనా.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తన సోదరిపై యాసిడ్ దాడి జరగడంతో ఆమెకు 52 సార్లు సర్జరీ నిర్వహించారని, ఈ క్రమంలోనే తన సోదరి మానసికంగా.. శారీరకంగా చాలా కృంగిపోయింది.ఈ ఘటన తనని ఎప్పుడూ కలిసి వేస్తుందని అందుకే తన పక్క నుంచి ఎవరైనా వెళ్తున్నా కూడా తనపై ఆసిడ్ దాడి చేస్తారేమోనని తాను ఎప్పుడు భయపడుతూనే ఉంటానని తెలిపారు. ఈ విధంగా తాను వెళుతున్నప్పుడు పక్కన ఎవరైనా వెళ్తే యాసిడ్ దాడి భయంతోనే తాను ముఖం దాచుకుంటానంటూ ఈ సందర్భంగా కంగనా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement