Saturday, November 23, 2024

Kamareddy : మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల కీల‌క నిర్ణ‌యం.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాం..

మాస్టర్ ప్లాన్ బాధిత రైతుల అత్యవసర సమావేశం ముగిసింది. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని రైతు జేఏసీ నిర్ణయించింది. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ ప్రకటన పై రైతులు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. రేవు ఉదయం నుంచి 49 మంది కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్లి వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దుకు కౌన్సిల్ తీర్మాణం చేయాలని కౌన్సిలర్లను కోరనున్నారు. 11న మున్సిపాలిటీ ఎదుట రైతు జేఏసీ ధర్నా చేయాలని తీర్మానం చేశారు. ఈనెల 11 తర్వాత ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటించారు. రైతులకు నష్టం చేసే పని ఎవరు చేయవద్దు, అద్దాలు ధ్వంసం, విధ్వంసం చేయవద్దు అని రైతు జేఏసి పిలుపునిచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement