ఉక్రెయిన్‌పై రష్యా దాడులు శనివారం కూడా కొనసాగాయి. ఖర్కీవ్‌లో తెల్లవారుజామున వరుస పేలుళ్లు సంభవించాయి. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఉక్రెయిన్ సరిహద్దు దేశాల్లో పర్యటించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆమె 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఉక్రెయిన్ సరిహద్దులోని పోలాండ్‌లోని వార్సావ్, రోమేనియాలోని బుకారెస్ట్‌లో పర్యటించనున్నారు.
రష్యాకు వ్యతిరేకంగా నాటో భాగస్వామ్య దేశాలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కమలా హారిస్ ఈ పర్యటన చేస్తున్నట్టు ఆమె డిప్యూటీ ప్రెస్ సెక్రెటరీ సబ్రినా సింగ్ తెలిపారు. ఉక్రెయిన్‌కు భద్రత, ఆర్థిక, మానవతా సాయంపై ఆయా దేశాలతో హారిస్ చర్చించనున్నట్టు తెలిపారు. తాము ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనబోమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో.. కమలా హారిస్ పర్యటన ఆసక్తికరంగా మారింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..