చెన్నై – ఇటీవలే తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తమిళనాడులోని కోయంబత్తూరు సిటీ తొలి మహిళా బస్సు డ్రైవర్ షర్మిలకు స్టార్ నటుడు కమల్ హాసన్ అండగా నిలిచారు. డీఎంకే ఎంపీ కనిమొళిని బస్సు కండక్టర్ అవమానించిందన్న కారణంతో ఉద్యోగాన్ని వదులుకున్న ఆమెకు ఓ కారును కానుకగా ఇచ్చారు. ‘కమల్ కల్చరల్ సెంటర్’ తరఫున మహిళా బస్సు డ్రైవర్ షర్మిలకు కారును అందించినట్లు కమల్ హాసన్ తెలిపారు. ఆమె ఓ వ్యాపారవేత్తగా మారేందుకే ఇలా చేసినట్లు చెప్పారు
. “ఇటీవలే షర్మిల చుట్టూ జరిగిన వివాదం గురించి తెలుసుకున్న ఆవేదన చెందాను. ఆమె ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి. షర్మిల కేవలం డ్రైవర్‌గానే ఉండకూడదు. ఎంతో మంది షర్మిలలను సృష్టించాలి. అందుకే కారును అందించాను. త్వరలోనే ఆమె వ్యాపారవేత్తగా మారుతుందని ఆశిస్తున్నాను” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.