‘బింబిసార’ విజయం తర్వాత నందమూరి కల్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రం నిర్మించింది. ఆషికా రంగనాథ్ నాయికగా నటించింది. కల్యాణ్‌రామ్ త్రిపాత్రా భినయం చేస్తుండటం విశేషం. శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా కల్యాణ్‌రామ్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
మీరు నటించిన బింబిసార తర్వాత మరో వైవిధ్యమైన కథతో అమిగోస్ చేస్తున్నట్టున్నారు.?
మనం నటించిన సినిమా సక్సెస్ అయితే మనమీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఇంకా బాధ్యత పెంచుతుంది . ఈ సారిధైర్యంగా కొత్తగా ప్రయత్నించవచ్చు అనే నమ్మకం వస్తుంది. నేను బింబిసార, అమిగోస్, డెవిల్ ఈ మూడు చిత్రాల కథలను మూడేళ్ల క్రితమే అంగీకరించాను. బింబిసార ఫలితం చూశారు. అమిగోస్ వినగానే కొత్తగా అనిపించింది. సహజంగా మూడు పాత్రలంటే అందరు ఊహించే దానికి భిన్నంగా ఉంటుంది. కేవలం ఒక హీరోయిన్ మాత్రమే ఉంది. ఇంకా విలన్ కూడా ఉండడు. ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు? అనేది ఆసక్తిగా ఉంటుంది.
అమిగోస్ అనే పేరు అర్థం అవుతుందా..? ఈ టైటిల్ ఎందు కు పెట్టారు?
ఇది ఆలోచించి తీసుకున్నాం. సినిమాలో మూడు పా త్రలు కీలకమైనవే. ఒకరికి సంబంధించిన పేరు బావుండదని అనిపించింది. దాంతో స్నేహానికి సంబంధించి టైటిల్ నుకున్నాం. అలా కొత్తగా ఉంటుందని సోషల్ మీడియాలో అమిగో అనే హ్యాష్‌ట్యాగ్ చూసి నచ్చడంతో పెట్టాం. టైటిల్ అర్థం తెలియదు అని అనుకోవద్దు. కాంతార సినిమా వచ్చే వరకు ఆ పేరు అర్ధం తెలియదు కదా..
ఇది ప్రయోగాత్మక చిత్రమా?
నా సినిమాలు కమర్షియల్‌గా తీసినవే. బింబిసార కూడా పాతకథనే కానీ వాటిని చూపించే విధానంలోనే ఉంటుంది. ఇంతకు ముందు చాలా మంది హీరోలు త్రిపాత్రాభినయం చేశారు. మా కుటుంబం హీరోలకు ఇలాంటి కథలు రావడం మా అదృష్టం.
మీ బాబాయ్ సినిమాలోని పాట రీమేక్ ఆలోచన ఎవరిది?
అమిగోస్‌లో ప్రతి సన్నివేశాన్ని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. ద్వితీయార్థంలో కథకు బ్రేక్ పడకుండా పాట ఉంటే బావుంటుంది బాబాయ్ సినిమాలోని పాటని రీమేక్ చేశాం.
మూడు పాత్రలు చేశారు కదా? వీటిలో నచ్చిన పాత్ర ఏదీ?
సినిమాలో నేను మంజునాథ్, సిద్దార్థ్, మైఖేల్ మూడు పాత్రలు చేశాను. ఈ మూడు కూడా నచ్చినవే.
కథ కొత్తగా ఉంది కదా.. ఇతర భాషల్లో రిలీజ్ చేయడం లేదు ఎందుకని?
ఈ ప్రశ్న చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ వారిని ఎడిగితే బావుంటుంది. మేము సినిమా గురించి మాత్రమే ఆలొ చించాం. మార్కెటింగ్ గురించి ఎలాంటి ఆలోచన లేదు.
ఒకే పోలికతో ఉన్న వ్యక్తులను మీరు చూశారా?
మనుషులను పోలిన మనుషులు ఉంటారని చదివాను. అంతేకాని చూడలే
మీ కొత్త సినిమాల గురించి చెప్పండి?
డెవిల్ సినిమా ఇప్పటికే చాలా భాగం పూర్తయింది. మరో మూడు నెలల్లో పూర్తి అవుతుంది. ఇక బింబిసార 2 ఈ ఏడాది చివర్లో ప్రారంభిస్తాం.