Monday, November 25, 2024

కాళేశ్వరంలో – రెండవ రోజు పుష్కర శోభ

మహాదేవపూర్(ప్రభ న్యూస్): దక్షిణ అరణ్య శైవ క్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి క్షేత్రం లో గురువారం రెండవ రోజు పుష్కర శోభ సంతరించుకుంది. మూడు నదుల కలయికైన ముచ్చటైన త్రివేణి సంఘమా ప్రాణహిత నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి ప్రాణహిత నదికి ప్రతేక పూజలు నిర్వహించి చీర, సారె,గాజులు,పూలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పితృ దేవతలకు పిండ తర్పణాలు చేశారు. అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి కి పాలాభిషేకలు,శుభ నంద అమ్మ వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement